మీరు చాలా రొమాంటిక్ అని ప్రేమించిన వారితో చెప్పించుకోవాలనుందా? ఐతే ఇది చదవండి..

-

ప్రేమలో ఉన్నవారికి లోకం కనబడదు. ప్రపంచం మొత్తం తమ కళ్ళముందే ఉన్నా, కళ్ళలో ప్రేమించిన వారిని పెట్టుకుని తిరుగుతుంటారు. తాను ప్రేమించిన అమ్మాయి ఏ చిన్న పనిచేసినా పొగుడుతుంటారు. అమ్మాయి ముందు మార్కులు కొట్టేయాలని తపన పడుతుంటారు. ఐతే సాధారణంగా అమ్మాయిలు బయటపడరు. ఏ విషయంలోనైనా ఏదైనా చెప్పాలంటే చాలా ఆలోచిస్తారు. ఇక పొగడ్తల విషయమైతే మరీ దూరంగా ఉంటారు. అందుకే అమ్మాయిని పొగిడిన అబ్బాయిలు కనిపిస్తారు కానీ, అబ్బాయిని పొగిడిన అమ్మాయిలు కనిపించరు.

అమ్మాయి నుండీ పొగడ్త వస్తే ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఫీలైపోతుంటారు. ఐతే అమ్మాయిలు పొగడడమనేది చాలా అరుదు. అది నువ్వు చాలా రొమాంటిక్ అని పొగడడం ఇంకా కష్టం. నువ్వు చాలా రొమాంటిక్ అని అనిపించుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ముందుగా, నిన్ను నువ్వు పరిశీలించుకో. దేని గురించైనా నువ్వు బాధపడుతున్నావేమో చూసుకో. నువ్వు హ్యాప్పీగా లేకపోతే నీ భాగస్వామిని హ్యాప్పీగా ఉంచలేవు. నువ్వు సంతోషంగా కనిపిస్తే, నీతో ఎక్కువ సేపు గడపడటానికి ఆసక్తి చూపిస్తుంది.

వారనికోసారైనా మీరిద్దరే కలిసి బయటకి వెళ్ళండి. పెళ్ళైన కొత్తలో హనీమూన్ కి వెళ్ళినట్టు, వారంలో ఒకరోజు హాయిగా గడపండి.

చిన్న విజయమైనా ఆనందించాలి. ఏ విషయంలోనైనా మీ భాగస్వామి ప్రతిభని గుర్తించి, దాన్ని మీరెంత ఆనందిస్తున్నారో తెలియజేయండి.

మీ భాగస్వామితో ఏదైనా చిన్నపాటి గొడవ జరిగితే, అందుకు తగిన కారణాలు డైరెక్టుగా చెప్పకుండా ఒక లెటర్ రాసి ఇవ్వండి. మీరు ప్రేమలో ఉన్నట్లయితే తన గురించి మీరేం అనుకుంటున్నారో ఉత్తరం ద్వారా తెలియజేయండి. స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇదంతా నాన్సెన్స్ అనుకుంటే మీ పొరపాటే. ఫోన్లోనో, మాటల ద్వారానో చెప్పలేని విషయాలని పేపరు మీద పెన్ను పెట్టి చెప్పవచ్చు.

మీ మాటల్లో క్రియేటివిటీ ఉండేలా చూసుకోండి. అంతే, ఈ విషయాలు పాటిస్తే మీరు ప్రేమించిన వారి నుండి మీరు ఆశించిన పొగడ్త పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news