ఇంట్లో తాజ్‌మహల్‌, జలపాతం, నటరాజ విగ్రహం లాంటి పెయింటింగ్స్ ఉన్నాయా..?

-

ఇళ్లు అంటే.. ఆనందానికి ఆరోగ్యానికి నిలయం.. ఇల్లు అందంగా, పరిశుభ్రంగా ఉంటే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట నుంచి ఎన్నో టెన్షన్స్‌, చిరాకుతో ఇంటికి వస్తాం.. ఇంటికి రాగానే మనసుకు హాయిగా అనిపించాలి.. ప్రకృతి ప్రేమగా పలకరించినట్లు ఉండాలి.. అప్పుడే ఆ టెన్షన్‌ అంతా తీసేసినట్లు పోతుంది. అలా ఉండాలంటే.. ఇంటి వాస్తు, ఇంట్లో ఉండే వస్తువులు చాలా ముఖ్యం.. చాలామంది తెలిసి తెలియకు బాగున్నాయి కదా అని ఏవేవో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏది పడితే అది ఇంట్లో పెడితే… మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని పెట్టుకోకూడని వస్తువులు ఉంటాయి.. అవేంటంటే..

యుద్దాలను ప్రతిబింబించే ఏ ఫోటోలు, పెయింటింగ్స్ ఇంట్లో ఉంచకూడదు. ఇలా ఉంటే మన ఇంట్లో ఒకరి మీద ఒకరికి కోపాలు పెరిగుతాయట.. బంధువులతోనూ గొడవలు జరుగుతాయి. అలాంటి ఫొటోలు, పెయింటింగ్‌ల‌ను ఇంట్లో పెట్టుకోరాదు.

ముళ్ల మొక్కలు ఇంట్లో ఉంటే.. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. చేతిలో పైసా నిలువకపోగా అప్పుల పాలు అవుతారు. గొడవలు అవుతాయి. ముళ్ల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌రాదు. ఇక ఇంట్లో గోడలపై, ముఖ్యంగా బెడ్ రూమ్‌లో ఏడుస్తున్న బాలుడి ఫోటో ఉండకూడ‌దు. ఇలా ఉంటే పుట్టబోయే సంతానం అభద్రతాభావం కలిగిన వారై పుడతారట. అలాంటి ఫొటోల‌ను తీసేయాలి.

కురుక్షేత్ర యుద్దానికి సంబంధించిన ఫోటోల‌ను మన ఇంట్లో ఉంచకూడదు. వీటి వల్ల బంధువులతో వైరాలు వచ్చే ప్రమాదం ఉంది.. ఇలాంటి ఫొటోలు లేదా పెయింటింగ్‌ల‌ను కూడా ఇంట్లో పెట్ట‌రాదు. ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే వాస్తు దోషం ఏర్ప‌డి అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి.

ప్రతిఫలాన్ని సూచించని చిత్రాలు.. పండ్లు, పూలు పుయ్యని చెట్లు.. నీళ్లు లేని నదిలో పడవ, నగ్న చిత్రాలు, ఇంద్రజాల ప్రదర్శన చిత్రాలు.. ఇలాంటి చిత్రాలుంటే.. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా దురదృష్ట వార్తలు ఎక్కువగా వింటారట..ఇలాంటి ఫొటోలు, పెయింటింగ్‌ల‌ను కూడా ఇంట్లో నుంచి తీసేయాలి.

ప్రేమకు చిహ్నం.. తాజ్‌మహల్‌. ఇంట్లో ఇది ఉంటే.. ఆ ఇంట్లో వాళ్ల మధ్య ప్రేమ పెరుగుతుందనుకుంటారేమో..తాజ్ మహ‌ల్ వాస్తవానికి ముంతాజ్ సమాధి. సమాధుల ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు రీత్యా అత్యంత ప్ర‌మాద‌క‌రం. తాజ్ మ‌హ‌ల్ ఫొటోలే కాదు.. బొమ్మ‌లు ఉన్నా స‌రే వెంట‌నే తీసేయండి. ఒంటరిగా ఉన్న జంతువుల ఫోటోలు కానీ, క్రూర ప్రవృత్తి గల జంతువుల ఫోటోలు కానీ బెడ్ రూమ్‌లో ఉండకూడదు. ఇలా ఉంటే భార్యభర్తల మధ్య సఖ్యత దెబ్బతినడమే కాకుండా ఇంట్లో ఉన్న వారికి పట్టరాని కోపం వస్తుంటుంది.

విరిగిపోయిన బొమ్మలు, పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు. దీని వ‌ల్ల సంపాదనలో తృప్తి ఉండదు. ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. జ‌ల‌పాత‌పు పెయింటింగ్స్ మన ఇంట్లో ఉంటే.. మన సంపద మన చెంత ఎక్కువ కాలం నిల్వ ఉండదట..ఇవి మన స్థానాన్ని ఉన్నతం నుంచి అథ‌మం వైపుగా క్రమంగా దిగజార్చుతాయి. జ‌ల‌పాతాల‌కు చెందిన ఫొటోలు లేదా పెయింటింగ్‌ల‌ను కూడా ఇంట్లో ఉంచ‌రాదు. అలాగే తాండవం చేస్తున్న నటరాజ విగ్రహం ఇంట్లో ఉంటే వినాశనానికి కారణం అవుతుందట. ఆ విగ్ర‌హాన్ని కూడా తీసేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version