23 క్యారట్ బంగారంతో ఐస్ క్రీమ్… ధర 60,000 రూపాయిలు..!

సాధారణంగా బంగారంతో నగలు, కాయిన్స్ వంటివి మనం చూసి ఉంటాం. కానీ బంగారం ఐస్ క్రీమ్ గురించి ఎక్కడైనా చూసారా..? అవునండి నిజంగా గోల్డ్ తో ఐస్ క్రీమ్ చేసారు. సాధారణ ఐస్ క్రీమ్ ధర చాలా తక్కువే ఉంటుంది.

కానీ 23 క్యారెట్ ఎడిబుల్ బంగారంతో చేసిన ఈ ఐస్ క్రీమ్ ధర 60 వేల రూపాయలు. Jumeirah road స్కూపి కేఫ్ దుబాయిలో తాజాగా ఒక వ్లాగర్ ఈ డైమండ్ ఐస్ క్రీమ్ ని తిన్నారు. దానికి సంబంధించి ఒక పోస్టు తన యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.

అయితే ఇది రెగ్యులర్ గా ఉండే వెన్నెల ఐస్ క్రీమ్ కాదు. తాజా వెన్నెల బీన్స్ తో తయారు చేసి 23 క్యారెట్ గోల్డ్ ని, కుంకుమ పువ్వుని మరియు బ్లాక్ ట్రఫుల్స్ ని టాపింగ్ చేయడం జరిగింది. ఈ ఐస్ క్రీం యొక్క రేటు 60 వేల రూపాయలు.

నిజంగా బంగారాన్ని ధరించడం చూస్తాం కానీ బంగారం తినడం కాస్త వింతగా ఉంది కదా.. ఇప్పటికే ఈ వీడియోని రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు అయితే 60 వేల రూపాయలతో చాలా వస్తాయి కదా అని కామెంట్లు చేశారు. మరొక నెటిజెన్ అయితే దుబాయ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తినాలి అని కామెంట్ చేశారు. ఇలా ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయిపోయింది.