ఇదేం అలవాటురా బాబు.. రహస్యంగా ఐదేళ్లుగా వెంట్రుకలు తింటున్న బాలిక..!!

-

జనరల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుంది. పిచ్చి ఎందుకు అంటున్నాం అంటే.. మీరే చెప్పండి.. స్పూన్స్‌ తినడం ఎవరికైనా అలవాటుగా ఉంటుందా..? జుట్టు తినడం ఉంటుందా..?ఇలాంటి అలవాట్లు ఉంటే ఏమంటారు..? మనం చిన్నప్పుడు నోట్లో వేలు వేసుకోవడం వరకే ఆగిపోయాం.. కానీ కొందరు కడపులో స్పూన్స్‌, బ్యాటరీలు, జుట్టు కూడా వేస్తున్నారు. ఓ బాలికకు వెంట్రుకలు తినే అలవాటుందట.. ఆమె కడుపులోంచి కేజీ వెంట్రకలను వైద్యులు తొలగించారు.
ఉత్తర ప్రదేశ్‌లో వింత ఘటన వెలుగులోనికి వచ్చింది. అయోధ్యలో 14 ఏళ్ల బాలిక కడుపులోంచి 1 కిలోల వెంట్రుకలను తొలగించారు. బాలిక మేనమామ ధర్మేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లుగా కూతురు రహస్యంగా వెంట్రుకలను తింటుందట..బాలికకు హఠాత్తుగా కడుపునొప్పి మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆనంద్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అల్ట్రాసౌండ్ చేయగా, బాలిక కడుపులో వెంట్రుకలు పెద్ద కుప్పగా ఉండటాన్ని గుర్తించారు. దీని కారణంగా, కడుపులో కణితి ఏర్పడిందట.
ఆపరేషన్ చేసిన డాక్టర్ రాకేష్ తివారీ మాట్లాడుతూ.. అల్ట్రాసౌండ్ నివేదికను చూసినప్పుడు, అమ్మాయి కడుపులో వెంట్రుకలు ఉన్నాయని, అది కణితి రూపంలో ఉందని తేలిందని చెప్పారు. దీని తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారట…ఆపరేషన్ చేసి కడుపులో వెంట్రుకలు అంతా తొలగించారు. బాలిక ప్రాణాలతో బయటపడింది. బాలిక త్వరలోనే కొలుకుంటుందని కూడా పేర్కొన్నారు.
చిన్నపిల్లలు అన్నం తప్ప అన్నీ తింటారు. వారు ఏంటున్నారు నోట్లో ఏం పెట్టుకుంటున్నారో జాగ్రత్తలా చూడాల్సిన బాధ్యత ఇంట్లో వాళ్లదే.. చాలావరకూ పిల్లలు ఉన్న ఇంట్లో అవసరం లేని వస్తువులను అందుబాటులో ఉంచకూడదు. అది మనకు అవసరం ఉండదు. కానీ వాళ్లు దాంతో ఏదో ఒకటి చేసుకుంటారు. ఆఖరికి నోట్లో వేసుకుని మింగినా మింగుతారు. వెంట్రుకలు కడుపులోకి వెళ్తే చాలా ప్రమాదం.. తినేప్పుడు ఒక్క వెంట్రక వస్తేనే మనం ఊసేస్తాం.. ఆ బాలిక అదేపనిగా వెంట్రుకలను ఎలా తిన్నదో ఏంటో..? అదృష్టవశాత్తూ ఆపరేషన్‌ చేసి బాలిక ప్రాణాలు అయితే కాపాడగలిగారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version