వైరల్ వీడియో : ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాల మీద పడ్డాడు… ఇంతలో..!

-

ఫోన్ మాట్లాడే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది… కొంత మంది రోడ్డు మీద ఫోన్ నొక్కుతూ ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఫోన్ మాట్లాడే సమయంలో తమ పక్కన ఏం ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పట్టించుకునే ప్రయత్నం కూడా చేయరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ జబ్బు ఉంది. ఇలా ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్న సంగతి తెలిసిందే. ఫోన్ నే జీవితంగా భావిస్తూ ఫోన్ తోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పలువురు.

ఇందుకు ఎవరూ అతీతం కాదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ట్రైన్ కింద పడిపోగా పక్కన ఉన్న వ్యక్తి కాపాడాడు. సాధారణంగా రైల్ ఫ్లాట్ ఫారం మీద నిలబడినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే హటాత్తుగా వచ్చే రైలు కింద ప్రాణాలు పోగొట్టుకోవడమే. తాజాగా అమెరికాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుది. కొన్ని సార్లు సెకన్లలో జీవితం కోల్పోతూ ఉంటారు. ఇలా సెకన్లలో ఒక వ్యక్తి మరో వ్యక్తి జీవితాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే…

కాలిఫోర్నియాలోని కొలీజియం స్టేషన్‌లో ఆదివారం ఓక్లాండ్ రైడర్స్ ఆట తర్వాత ప్రజలు తిరిగి వస్తున్నారు. ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఫ్లాట్ ఫారం మీద నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ… పట్టాల మీద పడిపోయాడు. అక్కడ జనాలను కంట్రోల్ చేస్తున్న జాన్ ఒనార్గ్ అనే ఒక కార్మికుడు ఆ వ్యక్తి పడటం చూసి వెంటనే పట్టుకుని పైకి లాగాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ దీనిని BART (SFBART) ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా కాపాడిన వ్యక్తి దాదాపు 20 ఏళ్ళుగా అక్కడ పని చేస్తున్నాడట.అక్కడ ఉన్న పలువురు అతన్ని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version