పెన్ను, పేపరు పట్టి ఎన్ని రోజులైందో కదా.. ఈ ప్రత్యేకమైన రోజున చేతుల్లోకి పెన్ తీసుకోండి..

-

జనవరి 23.. జాతీయ చేతిరాత దినోత్సవం. అసలు చేతిరాతకి కూడా ప్రత్యేకమైన దినోత్సవం ఉంటుందని చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే చాలా మంది రాయడం మర్చిపోయారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో రాయడం మర్చిపోతున్నారు. ఇంకా మాట్లాడుకోవాలంటే పెన్ను, పేపరు పట్టుకోక ఏళ్ళు గడిపేసినవాళ్ళు కూడా ఉన్నారు. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ తీసి, అందులో ఫీడ్ చేసేస్తున్నారు. ఉత్తరాలు లేవు. అన్నీ ఈ మెయిల్స్ లోనే జరిగిపోతున్నాయి.

ఐతే రాసే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. మన మెదడులో అస్తవ్యస్థంగా తిరుగుతున్న ఆలోచనల్ని ఒక క్రమ పద్దతిలో పెట్టడానికి వాటిని పేపర్ మీద రాస్తే సరిపోతుంది. మీకీ విషయం తెలుసా? అందమైన చేత్రివ్రాత ఉన్నవారు ఏది రాసినా చదువుతూ ఉండాలనిపిస్తుంది. అంతేకాదు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అందంగా రాసేవారికి ఎక్కువ మార్కులు, చిత్తుగా రాసే వారికి తక్కువ మార్కులు రావడానికి కారణం అదే.

మీ చేతివ్రాతని బట్టి మీ మనస్తత్వం తెలుసుకోవచ్చు. మీ వ్రాతల్ని బట్టి అది రాసేటపుడు మీరే మూడ్ లో ఉన్నారో కనుక్కోవచ్చు. వయసు పెరుగుతున్న కొలదీ చేతివ్రాతలో మార్పులు రావడం గమనించవచ్చు. చేతివ్రాతల ద్వారా మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. అలా అంచనా వేసే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. మరో విషయ్ం ఆడవాళ్ల చేతివ్రాతకీ, మగవాళ్ళ చేతివ్రాతకీ చాలా తేడా ఉంటుంది.

మనసంతా ఆలోచనలతో నిండుగా ఉన్నపుడు ఏం చేయాలో అర్థం కాకపోతే వాటిని పేపర్ మీద పెట్టండి. అప్పుడు మీకో క్లారిటీ వస్తుంది. అందుకే రాయడం నేర్చుకోండి. సాంకేతికత వచ్చి అన్నింటినీ సులభతరం చేస్తున్న సమయంలో కనీసం ఈ ప్రత్యేకమైన రోజున ఒక పేజీ అయినా రాయండి.

Read more RELATED
Recommended to you

Latest news