మన యాంక‌ర్లు ఒక్క ఎపిసోడ్‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

-

వెండితెర‌పై ఏమోగానీ బుల్లితెర‌పై మాత్రం నారీమ‌ణులదే హ‌వా. ముఖ్యంగా బుల్లితెర న‌టీమ‌ణుల క‌న్నా లేడీ యాంకర్లే చాలా ఎక్కువ డ‌బ్బు సంపాదిస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌గ యాంక‌ర్ల క‌న్నా లేడీ యాంక‌ర్లే ఇప్పుడు సంపాద‌న విష‌యంలో ముందుకు దూసుకుపోతున్నారు. వారిలో సీనియ‌ర్ యాంక‌ర్ సుమ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆయా టీవీల్లో మ‌న‌కు క‌నిపిస్తున్న లేడీ యాంక‌ర్లు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

యాంక‌ర్ సుమ ఒక ఎపిసోడ్‌కి రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలిసింది. త‌రువాత అన‌సూయ వంతు. ఈ జాబితాలో ఈమె రెండో స్థానంలో ఉంది. ఒక ఎపిసోడ్‌కి అన‌సూయ తీసుకునే మొత్తం రూ.2 ల‌క్ష‌ల‌ని స‌మాచారం. అలాగే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా పాపుల‌ర్ అయిన మ‌రో యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్ ఒక ఎపిసోడ్‌కి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. కాగా అన‌సూయ‌, ర‌ష్మి గౌత‌మ్‌లు ఇద్ద‌రూ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారానే పాపుల‌ర్ అయి ఆ త‌రువాత సినిమాల్లో న‌టిస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.

ఇక యాంక‌ర్ శ్యామ‌ల ఒక ఎపిసోడ్‌కు రూ.70వేల వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. అలాగే యాంక‌ర్లుగా ఇప్పుడిప్పుడే రాణిస్తున్న వ‌ర్షిణి, మంజూష‌లు ఒక ఎపిసోడ్‌కు రూ.30 వేల నుంచి రూ.50వేల వ‌ర‌కు తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. వీటితోపాటు ఈ యాంక‌ర్లంద‌రికీ బ‌య‌ట ప్రోగ్రామ్‌లు చేస్తే అద‌నంగా పారితోషికం ల‌భిస్తుంది. సుమ అయితే ఆ విష‌యంలో ముందు ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా వ‌ర‌కు ఆడియో, సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ల‌లో ఇప్ప‌టికీ యాంక‌ర్ సుమ‌దే పై చేయిగా ఉంది. ఏది ఏమైనా.. లేడీ యాంక‌ర్లు మాత్రం పారితోషికం విష‌యంలో మ‌గ యాంక‌ర్లతో పోటీ ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news