వాట్సాప్‌లో ఇంపార్టెంట్ మెసేజ్‌ల‌ను ఇలా సేవ్ చేసుకోండి..

వాట్సాప్ అంటే ఇప‌పుడు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో అవ‌స‌ర‌మైన యాప్‌గా మారింది. ఏది పంపాల‌న్నా కూడా అంద‌రూ ముందుగా దీన్నే ఎంచుకుంటున్నారు. కాగా వాట్సాప్‌లో వ‌చ్చే కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌ల‌ను ఎలా సేవ్ చేసుకోవాలో తెలియ‌క చాలామంది ఇబ్బంది ప‌డుతుంటారు. కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చే వాట్సాప్ మెసేజ్‌ల‌తో అస‌లు ఇంపార్టెంట్ మెసేజ్ లు కాస్తా క‌నిపించ‌కుండా పోతుంటాయి. మ‌రి ఇలాంటి ముఖ్య‌మైన మెసేజ్ ల‌ను వాట్సాప్‌లో ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా వాట్సప్ ఓపెన్ చేయండి.

అందులో బుక్ మార్క్ చేయాలనుకునే మెసేజ్ ను ఎంచుకోండి. ఆ మెసేజ్‌పై ప్రెస్ చేసి హోల్డ్ చేసిన త‌ర్వాత స్టార్ పైన ఎంట‌ర్ చేస్తే ఆటోమేటిక్ గా ముఖ్యమైన మెసేజెస్ అన్నీ కూడా ఇలా బుక్ మార్క్ అయిపోతాయి. ఇక ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేసి మూడు చుక్క‌లు ఉన్న దానిపైన ఎంట‌ర్ చేయండి. ఇక ఇందులో మీకు Starred messages అనే ఆప్షన్ ఎంచుకోండి. ఆ త‌ర్వాత మీకు సేవ్ చేసిన మెసేజెస్ అన్నీ కూడా క్లియ‌ర్‌గా కనిపిస్తాయి.

ఒక వేళ మీరు సేవ్ చేసిన మెసేజ్ లో ఏదైనా ఇక అన‌వసరం అనుకుంటే దాన్ని అన్‌స్టార్ చేయొచ్చు. ఇక మిగిలిన ముఖ్య‌మైన మెసేల్ అన్నీ కూడా మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా కూడా బుక్ మార్క్ చేస్తే స్టార్డ్ మెసేజెస్‌లో చ‌దువుకోవ‌చ్చు. కాగా వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా కేవ‌లం మెసేజ్ లు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు లేదా ఇత‌ర డాక్యుమెంట్ల‌ను కూడా సేవ్ చేసుకోవచ్చ‌ని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సేవ్ చేసిన మెసేజెస్ అన్నీ ఒకే దగ్గర మ‌న‌కు కనిపించ‌డంతో మ‌న ప‌ని ఇంకా ఈజీగా అవుతుంది.