ద‌స‌రా పండ‌క్కి బైక్ కొనాల‌ని చూస్తున్నారా..? ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు..!

-

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా ద‌స‌రా వ‌చ్చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఇప్ప‌టికే ఈ నెల చివ‌ర్లో ప్ర‌త్యేక సేల్‌ల‌ను ప్రారంభించ‌నున్నాయి. అయితే ఆటోమొబైల్ త‌యారీ సంస్థ‌లు కూడా ద‌స‌రా ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చాయి.

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా ద‌స‌రా వ‌చ్చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ-కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఇప్ప‌టికే ఈ నెల చివ‌ర్లో ప్ర‌త్యేక సేల్‌ల‌ను ప్రారంభించ‌నున్నాయి. అయితే ఆటోమొబైల్ త‌యారీ సంస్థ‌లు కూడా ద‌స‌రా ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయా ఆటోమొబైల్ కంపెనీలు ఏయే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయో ఇప్పుడు ఓ లుక్కేద్దామా..!

two wheeler companies dussehra offers

బ‌జాజ్ కంపెనీ తాను త‌యారు చేసే అన్ని టూ వీల‌ర్స్‌పై రూ.6వేల వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు 5 ఉచిత స‌ర్వీసులు, 5 ఏళ్ల వారంటీ స్కీంను కూడా ఆ కంపెనీ అంద‌జేస్తోంది. అన్ని బ‌జాజ్ బైక్‌ల‌పై ఈ ఆఫ‌ర్లు అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇక య‌మహా రూ.3,999 త‌క్కువ‌ డౌన్ పేమెంట్ లేదా సున్నా శాతం వ‌డ్డీతో త‌న బైక్‌ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ద‌స‌రా సీజ‌న్‌లో (అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌రకు) కొనే య‌మ‌హా స్కూటర్ల‌పై ఏడాదికి రూ.8వేలు ఆదా చేయ‌వ‌చ్చ‌ని ఆ కంపెనీ చెబుతోంది. ఇక బైక్ ఫైనాన్స్‌ను కూడా కేవ‌లం 6.9 శాతం వ‌డ్డీకే య‌మ‌హా అందిస్తోంది.

సుజుకి మోటార్ సైకిల్స్ కంపెనీ త‌న బైక్ ల‌ను పేటీఎం ద్వారా కొనుగోలు చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు అందులో రూ.8500 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. అలాగే కేవ‌లం రూ.777 అత్య‌ల్ప డౌన్ పేమెంట్‌ చెల్లించి, ఆన్ ది స్పాట్ లోన్ అప్రూవ్ చేసుకుని బైక్‌ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశాన్ని కూడా ఈ కంపెనీ క‌ల్పిస్తోంది. ఇక తీసుకున్న లోన్ మొత్తాన్ని 4 ఏళ్ల‌లో చెల్లించే స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నారు. కాగా ద‌స‌రా సీజ‌న్‌లో సుజుకి బైక్‌ల‌ను కొనుగోలు చేసే క‌స్ట‌మ‌ర్లు ల‌క్కీ డ్రాలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారును సొంతం చేసుకునే ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే ఆ ల‌క్కీ డ్రాలో క‌స్ట‌మ‌ర్లు ఒక్కోటి 5 గ్రాముల బ‌రువున్న 22 క్యారెట్ల బంగారు నాణేల‌ను కూడా గెలుచుకోవ‌చ్చు.

అయితే దాదాపుగా అన్ని టూవీల‌ర్ త‌యారీ కంపెనీలు ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. కానీ ఇంకా టీవీఎస్‌, హీరో మోటో కార్ప్‌, హోండా కంపెనీలు రంగంలోకి దిగ‌లేదు. ఈ క్ర‌మంలోనే పండుగ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఆ కంపెనీలు కూడా త్వ‌ర‌లో ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news