మహమ్మారి విజృంభిస్తున్నా పెళ్ళిళ్ళు ఆగకపోవడానికి కారణాలేంటి?

-

దాదాపుగా నెల క్రితం వరకూ అంతా మామూలుగానే ఉండింది. కానీ ఈ నెలలోనే అంతా తారుమారు అయ్యింది. అప్పటి వరకూ కరోనా పోయింది, ఇక భయమేమీ లేదు అనుకున్న జనాలు, సెకండ్ వేవ్ అన్న పేరు విని షాకయ్యారు. దాని ప్రతాపం చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ లాక్డౌన్ పెట్టమని గోల చేస్తున్నారు. ఐతే ఎంత గోల చేసినా కూడా పెళ్ళిళ్ళు మాత్రం ఆపడం లేదు. అవును, కరోనా విజృంభిస్తున్న ఈ టైమ్ లోనూ వివాహాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

సాధారణంగా వివాహం అంటే పెద్ద సంబరం. ఆ సంబరాన్ని అందరిముందు చేసుకోవాలనీ, హ్యాపీగా ఆనందంగా గడపాలని అనుకుంటారు. కానీ కరోనా వల్ల అది కుదరడం లేదు. నిజానికి పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవచ్చు. కానీ అలా జరగడం లేదు. చాలామంది పెళ్ళిళ్ళని ఆపడం లేదు. బంధువులు, స్నేహితులు ఎక్కువగా లేకపోయినా వాళ్ళనుకున్న ముహుర్తానికి పెళ్ళిళ్ళు కానిచ్చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోవిడ్ పాజిటివ్ వచ్చిన అబ్బాయి పీపీఈ కీట్ ధరించి వివాహం చేసుకున్న సంగతి ఆన్ లైన్లో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే.

పెళ్ళిని ఒక సంబంరంగా కాకుండా అనుకున్న ముహుర్తానికే ఎవ్వరూ లేకపోయినా ఎందుకు కానిచ్చేస్తున్నారనేది చాలామంది ప్రశ్న. దీనికి ఎవరి సమాధానాలు వారికున్నాయి. వాటిల్లో కొన్ని, ముందుగా.. అప్పటికే మొదటి వేవ్ కారణంగా వాయిదా పడ్డ పెళ్ళిళ్ళని ఇంకా వాయిదా వేయడం ఇష్టం లేక చేసేస్తున్నారు.
రెండు: అబ్బాయి, అమ్మాయి జాతకాల ప్రకారం ఇప్పుడు తప్ప మరెప్పుడూ మంచి రోజులు లేకపోవడం.
మూడు: చాలామందికి వయసు పెద్ద సమస్య. అనుకున్న వయసులో అవుతుందనుకున్న పెళ్ళి ఆలస్యం అవుతుండడంతో ఇబ్బందిగా మారుతుందన్న ఆలోచన.
నాలుగు: కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అలా తొందరగా కళ్యాణం జరిపించేస్తే వాడి బ్రతుకేదో బ్రతుకుతాడని పెద్దల ఆరాటం.
ఐదు: పెళ్ళిచూపులకి, పెండ్లికి ఎక్కువ రోజులు ఉండకూడని నమ్మడం. అలా ఉంటే ఏదైనా చిన్న విషయాలకే గొడవలు పడి ఎక్కడ పెళ్ళి పాడవుతుందోనని భయం.

ఇలా రకరకాల కారణాల వల్ల పెళ్ళిళ్ళని ఆపలేకపోతున్నారు. ఏదేమైనా పెళ్ళిళ్ళు జరపకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి, కోవిడ్ నియమాలను అనుసరించి పెళ్ళిళ్ళని జరిపిస్తుండడం మరోటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version