వావ్.. చీరకట్టుతో వ్యాయామాలు చేసిన 56 ఏళ్ల మహిళ..వీడియో..

-

ఇప్పుడు అందరు బిజీ బిజిగా జీవితాన్ని గడిపేస్తున్నారు..ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు,పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు ఆహరపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపొయాయి..వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధుల పడుతున్నవారు సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.దీంతొ ఇప్పుడు అందరికి ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది..జిమ్ లని,యొగాలను తిరుగుతున్నారు..ఆరోగ్యపరంగా వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.. నిపుణులు కూడా తరచూ చెబుతూ ఉంటారు.

వయసు పైబడుతున్నకొద్దీ ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వ్యాయామంతో దూరంచేసుకోవచ్చని తమిళనాడులోని చెన్నై కు చెందిన ఓ మహిళ చెబుతోంది. చెప్పడమే కాదు, స్వయంగా వ్యాయామం చేసి చూపిస్తోంది. 56 ఏళ్ల వయసులో చీరకట్టుతోనే వ్యాయామం చేస్తోంది ఈ మహిళ..చెయ్యాలనే,పట్టుదల ఉంటే వ్యాయామానికి ఏది అడ్డుకాదని నిరూపిస్తున్న వారి సంఖ్య రెట్టింపు అవుతుంది.

వ్యాయామం చేయడానికి ఏదీ అడ్డుకాదని చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల మహిళ మోకాళ్ల నొప్పులతో చాలా రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో కొడుకు సలహామేరకు జిమ్ లో చేరింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో కొన్నాళ్లకే మార్పు కనబడిందని చెబుతోంది. ఇప్పుడు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానని వివరించింది..

ఇది చెన్నైలొ వెలుగు చూసింది.చెన్నై లోనే సదరు మహిళ కొడుకు ఓ జిమ్ ను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కోడలుతో కలిసి జిమ్‌కు వెళ్తారు. చీరతోనే వెళ్ళి బరువులు ఎత్తుతూ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన 52వ ఏట వ్యాయామం మొదలుపెట్టానని, ఇప్పుడు తన వయసు 56 ఏళ్లు అని, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా చురుకుగా ఉన్నానని వివరించారు. సదరు మహిళ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ.. ఆమె వయసు 56 ఏళ్లు.. జిమ్ కు చీరలో వస్తారు.. అయితేనేం, వ్యాయామం చేయకుండా ఆవిడను ఏదీ ఆపలేదని హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ కామెంట్ చేశాయి..ఆమె వ్యాయామం చేస్తూన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/Ck3NWmrKEvW/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Exit mobile version