రామ మందిర ప్రారంభోత్సవానికి బయలుదేరిన రజినీకాంత్‌, ధనుష్‌…… వీడియో వైరల్

-

మరో 24 గంటల్లో అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.అయితే తాజాగా సినీ రంగానికి చెందిన తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, తమిళ హీరో ధనుష్‌ కూడా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి అయోధ్యకు బయలుదేరారు. రజినీకాంత్, ధనుష్ చెన్నై ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంకా టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు కూడా అయోధ్యలో జరిగే వేడుకలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.

 

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో అధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా అయోధ్య బాట పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version