సీఎం రేవంత్‌తో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్‌ గోయెంకా భేటీ..

-

తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయంలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. వెల్‌స్పన్‌ గ్రూప్‌ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో 250కోట్ల పెట్టుబడిని చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవల్లో పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

టైర్-2, 3లలో ఐటీలను అభివృద్ధి పరిచి ప్రమోట్ చేసేందుకు ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ,స్పెషల్ సెక్రటరీ విష్ణురెడ్డి, వెల్‌స్పన్‌ గ్రూప్‌ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్, శ్రీస భార్గవ మొవ్వ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version