సీబీఐ వ్యవహారంపై దేశవ్యాప్తంగా  నిరసనలు..

-

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మని సెలవుపై వెళ్లమంటూ ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తనున్నాయి. ఇందుకు గాను శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ కేంద్ర కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్నారు.  వర్మను సీబీఐ చీఫ్‌గా నియమించడంతో పాటు, సెలవుపై పంపడంపై  ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ  డిమాండ్‌ చేస్తోంది.  ప్రతిష్ట్మాతక దర్యాప్తు ఏజెన్సీలో వివాదాలతో కీచులాడుకుంటున్న సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికి రాత్రి సెలవుపై పంపిన సంగతి , తెలంగాణ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావుని హడావుడిగా  సీబీఐ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింట నేపథ్యంలో సీబీఐ వ్యవహారం రాజకీయ ప్రధాన్యతను సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version