జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే పేర్ని నాని.ఇవాళ ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమై అనూహ్యంగా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై పేర్ని నాని స్పందిస్తూ… చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ డ్రామాలతో విసిగిపోయిన జనానికి, మరో కొత్త డ్రామా తెరపైకి తీసుకు వచ్చారని మండి పడ్డారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ….పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ,చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేష్ ప్రకటించినా తాము మౌనంగా ఉన్నామని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని ఆయన అన్నారు.గడచిన నాలుగున్నరేళ్లుగా పవన్ ప్రకటించిన నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీకి ఇంఛార్జిలే లేరని.. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని అన్నారు. తనపై జనసైనికుల్లో, పార్టీ నేతల్లో వస్తున్న వ్యతిరేకత చల్లార్చెందుకే తనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రకటించాడు అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్‌కు అంత పౌరుషం ఉంటే కాకినాడ, తిరుపతి,వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు..? అని ప్రశ్నించారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాగా ఎమ్మెల్యే పేర్ని నాని అభివర్ణించారు.