కర్ణాటక ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది, అదే విధంగా మే 10వ తదీన ఎన్నికలు మరియు 12వ తేదీన ఫలితాలు రానున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మరియు జీడీఎస్ పార్టీలు కీలకం కానున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 58282 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. అయితే ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 .2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఇందులో మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నవారు మొత్తం 2613 మందిగా తెలుస్తోంది.