కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోర్‌

-

ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దుమ్ము రేపింది. లక్నో బౌలర్లను చితక్కొడుతూ 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మాక్స్ వెల్ చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు. బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డు ప్లెసిస్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు పోటా పోటీగా బౌండరీలు బాదారు. సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. వీరిద్దరు తొలి వికెట్ కు 96 పరుగులు జత చేశారు. ఇదే క్రమంలో కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. అయితే ఈ సమయంలో కోహ్లీ అమిత్ షా పెవీలియన్ పంపాడు.

కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్..తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సిక్సులతో విరుచుకుపడ్డాడు. మాక్స్ వెల్ తో పాటు..డు ప్లెసిస్ సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరు పోటీ పడి మరీ పరుగులు సాధించడం విశేషం. ఇదే క్రమంలో మాక్స్ వెల్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 59 పరుగులు సాధించాడు. అటు డు ప్లెసిస్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 79 రన్స్ కొట్టాడు. చివర్లో మాక్స్ వెల్ ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, అమిత్ మిశ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version