చిన్నోడిపై పెద్దోడి ఫ్యాన్స్ ఫైర్…! ఎంత పని చేశావు నాగ వంశీ…..

-

విక్టరీ వెంకటేష్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో పెద్దోడిగా వెంకటేష్ నటించిగా ,చిన్నోడి పాత్రలో మహేష్ బాబు నటించాడు.దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ సినిమా వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ కనబడిన చిన్నోడు, పెద్దోడు గానే ప్రేక్షకులు పరిగణిస్తారు.

Saindhav

ఇదిలా ఉంటే…. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధువ్ కూడా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నాగ వంశీ ట్విట్టర్ డిస్కషన్ పెట్టగా అందులో కొందరు అభిమానులు సైందవ్ సినిమాకి థియేటర్లు రాకుండా బ్లాక్ చేస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు . దీనికి స్పందిస్తూ నిర్మాత నాగ వంశీ, బడా నిర్మాత సురేష్ దగ్గుపాటి ఉండగా నేనెలా అడ్డుపడగలనని అన్నాడు. అలాగే నేను వాళ్ల దగ్గరికి వెళ్లి మాది పెద్ద సినిమా మాకు సహకరించగలర అని ఎలా అడగగలనని…. మీ హీరో చిన్న హీరో అని నేను థియేటర్స్ అడగలేను కదా అని సమాధానం ఇచ్చాడు. దీంతో దగ్గుపాటి అభిమానులు మీ హీరో పెద్ద హీరో మా హీరో చిన్న హీరోనా అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. నిర్మాత నాగవంశీ సైంధవ్ సినిమా చిన్న సినిమా అని అంతేకాకుండా మీ హీరో చిన్న హీరో అని అర్థం వచ్చేలా మాట్లాడాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి మహేష్ అభిమానులు సైతం కౌంటర్స్ ఇస్తున్నారు. మరి చిన్నోడు ,పెద్దోడి మధ్య చిచ్చుపెట్టిన నాగ వంశీ దీనికి చెక్ పెడతాడో లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version