ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించకపొతే ఫోన్ ఢమాల్!

-

నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. అయితే ప్రతి రోజు ఫోన్ కి ఛార్జింగ్ ఎలా పెట్టాలి..? మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందా..? అయితే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ తప్పులు చేస్తే మీ ఫోన్ కే ప్రమాదం. చాలా మంది మొబైల్ ఫోన్ ఉపయోగించే వాళ్ళు ఈ తప్పులు తరచుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఫోన్ పోయే అవకాశం ఉంది. మీరు మీ ఫోన్లో చార్జింగ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించకపోతే మీ ఫోన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు టెక్ నిపుణులు.

mobile charging
mobile charging

ఛార్జింగ్ పెట్టే సమయంలో అజాగ్రత్తగా ఉంటే మీ ఫోన్ త్వరగా పాడైపోతుందని వారు హెచ్చరించారు. అయితే ఈ సమస్యలు చూసి మీరు తిరిగి చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోగానే వెంటనే చార్జర్ కనెక్షన్ పెట్టేసి కాల్ మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఇది చాలా ప్రమాదం. ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఫోన్ మాట్లాడటం ప్రాణాలకు కూడా ప్రమాదం అని గుర్తించండి అలానే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫోన్ తీసేసిన తర్వాత ఆ చార్జర్ ని ప్లగ్ లోనే ఉంచేస్తారు చాలా మంది. ఇలా చేయడం మంచిది కాదు.

ప్లగ్ లో ఉండిపోవడం వల్ల విద్యుత్ సరఫరా అవుతూనే ఉంటుంది దాని వల్ల పొరపాటున ఎవరైనా ముట్టుకుంటే అది ప్రాణాలకే ప్రమాదం అని గుర్తించండి ఇది షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల యూఎస్బీ కేబుల్ దెబ్బ తింటుంది. అలానే మీరు వంద శాతం వరకు బ్యాటరీ ఫుల్ చేయడం ద్వారా దాని లైఫ్ టైం తగ్గిపోతుందని అంటున్నారు టెక్ నిపుణులు.

అలాగే 100% చార్జింగ్ ఎప్పుడు పెట్టకండి. అయితే బ్యాటరీ లో ఛార్జ్ సైకిల్స్ అనేవి ఉంటాయి. అవి బ్యాటరీ పరిమితులు ప్రకారం కొంత శాతం మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది లేదంటే మీ బ్యాటరీ త్వరగా పడిపోతుంది . చార్జింగ్ పెట్టినప్పుడు 20 శాతం నుంచి 80 శాతం వరకు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా రాత్రి సమయంలో చార్జింగ్ పెట్టేసి నిద్ర పోకండి.

Read more RELATED
Recommended to you

Latest news