జూనియర్పంచాయతీ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు స్టే…

-

తెలంగాణలోభారీ సంఖ్యలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకంపై హైకోర్టు స్టేవిధించింది. పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలను పాటించలేదని కోర్టు ఆక్షేపించింది.తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకునియామక ఉత్తర్వులివ్వొద్దని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావుమధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే  ప్రక్రియను కొనసాగించుకోవచ్చని పేర్కొంది.. ఖమ్మంజిల్లాకు చెందిన బి.హరీశ్‌కుమార్, మరికొందరు పోస్టుల భర్తీ విషయంలో పలునియమాలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై బుధవారంన్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు విచారించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాహుల్‌రెడ్డివాదనలు వినిపిస్తూ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకుసంబంధించి ప్రాథమిక కీపై 70 వేల మంది అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. తుది కీ విడుదల చేయకుండా, అభ్యర్థుల ర్యాంకులు, మార్కులువెల్లడించకుండానే ఎంపికైన వారి జాబితాను ప్రచురించడాన్ని వారు తప్పు బట్టారు. రాష్ట్రస్థాయి, రిజర్వ్‌కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా మెరిట్జాబితాను ప్రచురించలేదని వివరించారు. జనరల్‌ అభ్యర్థులకు 45%, రిజర్వ్‌డ్‌అభ్యర్థులకు 55% రిజర్వేషన్లు కల్పించారన్నారు.ప్రభుత్వ తరఫు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలను సైతం ధర్మాసనం..తాము తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులకునియామక ఉత్తర్వులివ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news