ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించేలా కనిపిస్తోంది. ఇక రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. చండీగఢ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు :
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితిష్ రానా, రియాన్ పరాగ్, జురెల్, హిట్మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, యుద్వీర్ సింగ్, సందీప్ శర్మ.
పంజాబ్ జట్టు :
శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్, స్టోయినీస్, నెహల్ వధేరా, మ్యాక్స్ వెల్, శశాంక్ సింగ్, సూర్యంష్, జాన్సన్, అర్ష్ దీప్ సింగ్, ఫెర్గూసన్, చాహల్.