నవంబర్ 30కి ఎంతో ప్రాధాన్యత ఉందని.. 2023న నవంబర్ 30నే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ ఉత్సవాలు ముగింపు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల కష్టాలు ఏంటో నాకు తెలుసు అన్నారు. . నాకు ఈ అవకాశం వస్తుందని ఏనాడు అనుకోలేదు. రైతులకు బీఆర్ఎస్ పదేళ్లలో ఏం చేసిందో మాకంటే మీకే బాగా తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ అన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి వేసుకుంటే.. రూ.500 బోనస్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వారు కట్టిన ప్రాజెక్టులు కుప్పకూలిపోయి చుక్క నీరు రాలేదు అన్నారు.