మహిళను బంధించి.. టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ తండ్రి పలుమార్లు అత్యాచారం

-

ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా తమ స్థాయిని మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇప్పటికే స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న తరుణంలో.. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం అరాచకాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఇంది.. టీఆర్ఎస్​ సర్పంచ్​ తండ్రి ఓ మహిళను బంధించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సోషల్​ మీడియాలో విషయం వైరల్​ కావడంతో చివరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన దంపతుల ఐదెకరాల భూమి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​లోని వట్టెం రిజర్వాయర్ ​కింద పోయింది. ప్రభుత్వం నుంచి రూ. 22 లక్షల పరిహారం వచ్చింది. గ్రామ సర్పంచ్ మిద్దె శ్రీశైలం తండ్రి మిద్దె బాలస్వామి(65) నిర్వాసితులైన మహిళ(32), ఆమె భర్తను తన వద్ద పనికి పెట్టుకున్నాడు.

మహిళ భర్త దగ్గర ఉన్న ట్రాక్టర్​ను బాలస్వామి లీజ్​కు తీసుకున్నాడు. నిర్వాసితులైన ఆ కుటుంబానికి ప్లాట్​ ఇప్పిస్తానని నమ్మించి రూ.18.30 లక్షలు 2020లో తన బ్యాంక్​ అకౌంట్​లోకి మార్పించుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించడం, ట్రాక్టర్​లాక్కోవడంతో మహిళ భర్త ఊరు వదిలి పారిపోయాడు. హైదరాబాద్​లో తల దాచుకున్నాడు. మహిళను లొంగదీసుకున్న బాలస్వామి బిజినేపల్లిలో ఓ రూమ్​ కిరాయికి తీసుకుని ఆమెను అక్కడ బంధించాడు. ఆమెపై పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి మహిళ భర్త జూలై 8న బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పట్టించుకోలేదు. ఆగస్టు 2న మహిళ స్వయంగా పోలీస్​స్టేషన్​కు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్​తండ్రి కావడంతో పోలీసులు కంప్లైంట్​ తీసుకోవడానికి వెనుకాడినట్లు సమాచారం. మహిళకు జరిగిన అన్యాయంపై సోషల్​ మీడియాలో వచ్చిన పోస్ట్​ వైరలైంది.

 

దీంతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ఆదేశాలతో టీఆర్ఎస్​ మండల నాయకులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. సర్పంచ్​ తండ్రి బాలస్వామి తప్పు చేశాడని తేలిందని ప్రకటించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఐద్వా నాయకులు జిల్లా అడిషనల్​ఎస్పీని కలిసి మహిళకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. శనివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు మిద్దె బాలస్వామిపై కేసు నమోదు చేసినట్ల బిజినేపల్లి ఎస్సై వెల్లడించారు.
women Physically harassed by trs sarpanch father

Breaking News, Latest News, Big News, Physically Harassed, Crime News

Read more RELATED
Recommended to you

Exit mobile version