మీ బంగారం నాణ్యమైనదో కాదో ఇంట్లో ఉంటే ఇలా తెలుసుకోండి..!

-

మీ బంగారం నాణ్యమైనదో కాదో ఇలా ఇంట్లో ఉంటే తెలుసుకోవచ్చు. బంగారం నిజమైనదా, నకిలీదా అని తెలుసుకోవడానికి ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. దీనితో సులువుగా చెప్పొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. వివరాల లోకి వెళితే… బంగారం ని ఇలా టెస్ట్ చెయ్యండి. దీనితో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

 

అయస్కాంతాలు:

నిజమైన బంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ అయస్కాంతాలను ఆకర్షించదు. ఒకవేళ అది ఆకాశర్షించింది అంటే బంగారం నకిలీది అని గమనించండి.

వెనిగర్:

మనం ఇళ్లల్లో వెనిగర్ ని ఉపయోగిస్తూ ఉంటాం. దీనితో మనం బంగారం యొక్క నాణ్యతని తెలుసుకోవచ్చు. బంగారం నాణ్యతను చెప్పడంలో వెనిగర్ చాలా ఉపయోగ పడుతుంది. దీని కోసం మీరు బంగారం మీద కొద్దిగా వెనిగర్ వెయ్యాలి. ఇప్పుడు కనుక కలర్ మారితే అది నకిలీది అని గుర్తించండి. కలర్ మారకపోతే అది నాణ్యమైన బంగారమే.

నైట్రిక్ యాసిడ్ :

ఇది కూడా నకిలీ బంగారాన్ని గుర్తించడంలో సహాయ పడుతుంది. బంగారం పై నైట్రిక్ యాసిడ్ రాస్తే రంగు మారదు. ఒకవేళ అది నకిలీ బంగారం అయితే, ఖచ్చితంగా యాసిడ్ ప్రభావాన్ని చూడవచ్చు. కాబట్టి ఇలా కూడా మీరు కనిపెటచ్చు.

నీళ్లు:

పాత్ర లో లేదా బకెట్‌ లో నీరు వేసి బంగారం వెయ్యండి. నిజమైన బంగారం నీటి లో మునిగి పోతుంది. నకిలీ బంగారం నీటి లో తేలుతుంది. కనుక ఇలా కూడా మీరు తేడా గమనించచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version