‘మోడీపై పోటీ చేయండి’…… మమతా బెనర్జీకి బిజెపి సవాల్

-

వచ్చే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గము నుంచి ప్రధానమంత్రి మోడీపై పోటీ చేయాలని మమతా బెనర్జీ కి ఒక బిజెపి నాయకుడు సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పోటీ చేసే బదులు…. సీఎం మమత బెనర్జీ ఎన్నికల బరిలో నిలిచోవాలని కోరారు. మీరు ప్రధాని కావాలనుకుంటున్నారు .కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ పై పోటీ చేయాలని బిజెపి ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్ వాఖ్యలు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఇండియా కూటమి సమావేశమై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రధాని మోడీ పై నిలబడాలని మమత బెనర్జీ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.

వాస్తవానికి 2019 లోనే మోడీపై ప్రియాంక గాంధీ పోటీ చేయాలని ప్రచారం జరిగింది. కానీ అజయ్ రాయ్ వారణాసి నియోజకవర్గం నుండి నిలుచున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చురుగ్గా పాల్గొన్న సందర్భంగా ఆమె యొక్క అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version