ఈ మధ్య కొన్ని సినిమాలతో మెప్పించి ఇప్పుడిపుడే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో శ్రమిస్తున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాల గురించి మాట్లాడుతూ టక్కున క్రికెట్ గురించి సంభాషణ రాగానే.. నేను అప్పట్లో క్రికెట్ ను ఎక్కువగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు సినిమాలలో వరుస అవకాశాలు వస్తుండడం కారణంగా క్రికెట్ ను ఎక్కువగా చూడడానికి టైం కుదరడం లేదని చెప్పింది. అంతే కాకుండా ఐశ్వర్య లక్ష్మి అప్పట్లో యువరాజ్ సింగ్ ను ఘాడంగా ప్రేమించానని చెప్పడం షాకింగ్ అని చెప్పాలి.
యువరాజ్ సింగ్ ను గాఢంగా ప్రేమించా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి !
-