దేశంలో రోడ్డు విపరీతంగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినా.. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా అస్సాంలో… ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంల ఏకంగా 10 మంది భక్తులు మృతి చెందారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే. అసోంలోని గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీమ్గంజ్ జిల్లాలో ఆటోను ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది మృతి చెందారు. వీరిలో మహిళలు అలాగే చిన్నారులే ఎక్కువగా ఉండటం గమనార్హం. చట్ పూజల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు వెళుతుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాచక చర్యలు చేపట్టారు. త్రిపుర సరిహద్దుల సమీపంలోని ఎనిమిదో నెంబర్ జాతీయ రహాదారి దగ్గర వేగంగగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.