18Pages : ’18 పేజెస్’ రిలీజ్ డేట్ ఖరారు

-

కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ హీరోగా రూపొందతున్న కొత్త సినిమా 18 పేజెస్‌. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పరణలో.. జియో 2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌ లపై.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.


గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు మరియు గ్లిమ్స్… అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో అప్డేట్ వదిలింది ఇది చిత్ర బృందం. ఈ సినిమా విడుదల తేదీని… విడుదల చేసింది… చిత్ర బృందం. ఫిబ్రవరి 18 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను వదలింది. ఈ పోస్టర్‌ లో నిఖిల్‌, అనుపమా చాలా రొమాంటిక్‌ గా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news