వివాహేతర డేటింగ్‌ యాప్‌లో 20 లక్షల మంది ఇండియన్స్‌..! దారుణంగా పడిపోతున్న బంధాలు

-

కాలం మారే కొద్ది ఆచారాలు, సంప్రదాయాలు మారిపోతున్నాయి.. నా జీవితం నా ఇష్టం అనే ధోరణి పెరిగిపోతుంది. పెళ్లి తర్వాత మాత్రమే చేయాల్సిన వాటిని పెళ్లికి ముందే చేసేస్తున్నారు.. అడిగితే పాష్‌ కల్చర్‌ అంటున్నారు. ఇది ఒక గ్రూప్‌ ఆఫ్‌ పీపుల్‌కు అస్సలు నచ్చడం లేదు.. మరికొంతమంది తప్పేం ఉంది అంటున్నారు..ఇద్దరు ఇష్టపడితే మీకు బాధ అంటున్నారు.. పాటించేవే రూల్స్‌, పెట్టుకునేవి పద్ధతులు..వద్దనుకుంటే వదిలేయడమే అనుకునేవాళ్లు ఉన్నారు.. వివాహేతర బంధాలకు ఆడమగ అంటూ తేడా లేదూ. ఇద్దరూ ఇలానే చేస్తున్నారు.. ఒక సర్వే ప్రకారం.. డేటింగ్‌ యాపక్‌ను ఇండియాలో 20 లక్షల మంది వాడుతున్నట్లు తేలింది..!
ఇంతకుముందు భారతదేశంలో పెళ్లికి ముందు అమ్మాయిలు, అబ్బాయిలు అసలు కలుసుకునేవారు కాదు. కానీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాక పెళ్లికి ముందే డేటింగ్ యాప్స్ వాడేస్తూ చాలామంది అఫైర్లు నడిపేస్తున్నారు… ఇప్పుడు ఏకంగా ఎక్స్‌ట్రామ్యారిటల్ డేటింగ్ యాప్ (Extramarital Dating App) అందుబాటులోకి రాగానే అందులో కూడా చేరుతున్నారు.. వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఎక్కువగా టైర్ 1 నగరాలకు చెందినవారే ఆసక్తి చూపిస్తున్నారని గ్లీడెన్ తాజాగా వెల్లడించింది. ఇక మిగిలిన వారు టైర్ 2, 3 నగరాలకు చెందినవారట.
గ్లీడెన్ అనేది ఆల్రెడీ పెళ్లయిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన డేటింగ్ యాప్. నిజానికి ఈ యాప్‌ని అందరూ వ్యతిరేకించాలి.. కానీ ఇందులో ఒక్క ఇండియా నుంచే 20 లక్షల మంది యూజర్లు చేరడం గమనార్హం.. వివాహేతర డేటింగ్ యాప్ గ్లీడెన్‌లో వినియోగదారుల సంఖ్య 18% పెరిగింది. డిసెంబర్ 2021లో 1.7 మిలియన్ల యూజర్లు ఉంటే ఆ సంఖ్య 2022లో 2 మిలియన్లకు పెరిగిందని గ్లీడెన్, ఇండియా కంట్రీ మేనేజర్ సిబిల్ షిడెల్ ఒక ప్రకటనలో తెలిపారు.
వివాహేతర సంబంధాల కోసం స్పెషల్‌గా తీసుకొచ్చిన ఫ్రెంచ్ యాప్ గ్లీడెన్‌లో ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది వినియోగదారులు చేరగా.. వారిలో 20% అంటే 20 లక్షల మంది వినియోగదారులు భారతదేశానికి చెందినవారే ఉన్నారు… ఈ 2 మిలియన్లలో వారి కొత్త సబ్‌స్క్రైబర్‌లలో 66 శాతం మంది టైర్ 1 నగరాల నుంచి, 44 శాతం మంది టైర్ 2, 3 నగరాల నుంచి ఉన్నారు.
 గ్లీడెన్ యూజర్ బేస్‌లో ఎక్కువగా 30 ఏళ్లు పైబడిన పురుషులు, 26 ఏళ్లు పైబడిన మహిళలు ఉన్నారట.. 60% మంది పురుషులతో పోలిస్తే 40% మంది మహిళా వినియోగదారులు కూడా ఉన్నారు. మహిళలకు సురక్షితంగా ఉండేలా యాప్‌ను డిజైన్ చేసినట్లు ఈ కంపెనీ తెలిపింది. ఈ యాప్‌లో జాయిన్ అయ్యే వారిలో అత్యధిక మంది అధిక సామాజిక-ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన వారే ఉండటం గమనార్హం. వీరిలో ఇంజనీర్లు, వ్యవస్థాపకులు, కన్సల్టెంట్లు, నిర్వాహకులు, వైద్యులు, అధిక సంఖ్యలో హౌజ్‌వైవ్స్‌ కూడా ఉన్నారు. ఒక్కప్పటి వ్యభిచార గృహాలే ఇప్పుడు యాప్‌ల రూపంలో అందరి ఫోన్లలోకి వచ్చాయి.. కూల్‌గా పని అయిపోతుంది.. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే భవిష్యత్తులో బంధాలు నిలబడతాయంటారా..?

Read more RELATED
Recommended to you

Exit mobile version