LIC నుండి అదిరే పాలసీ.. రూ. 22 లక్షలు లాభం..!

-

ప్రముఖ బీమా కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలని తీసుకు వస్తూనే ఉంటుంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అందించే ఈ పాలసీల్లో డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. కొత్త కొత్త పాలసీలతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది.

ఇప్పుడు తాజాగా ‘ధన్‌ సంచయ్‌’ పేరు తో ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ తో అదిరే లాభాలని పొందొచ్చు. మొత్తం 4 రకాల ఆప్షన్స్‌ ని అందించింది. ఇక పూర్తి వివరాలని చూస్తే… ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్‌ తో పాటు గ్యారెంట్‌ ఇన్‌కమ్‌ వస్తుంది. A,B,C,D అనే ఆప్షన్స్‌ లో ఈ పాలసీ ని అందిస్తున్నారు. ఒకవేళ కనుక పాలసీ తీసుకున్న వాళ్ళు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు ని అందిస్తారు.

5 నుంచి 15 సంవత్సరాల వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. అలానే ఈ పాలసీ ని తీసుకుంటే డెత్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఒక సారి కానీ ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతి లో కానీ చెల్లిస్తారు. నాన్-లింక్డ్, పార్టిసి పేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్ ఇది. ఈ పాలసీ కింద మీరు A, B ఆప్షన్స్‌ ని ఎంపిక చేసుకుంటే కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000గా ఉంటుంది.

ఈ స్కీమ్‌లో చేరడానికి పాలసీ దారుడి వయసు కనీనం మూడేళ్లు ఉండాలి. పాలసీ తీసుకుంటే ఏడాదికి కనీస ప్రీమియంగా రూ. 30,000గా ఉంది. 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక కనిష్టంగా రూ. 2.5 లక్షలు, రూ. 22 లక్షల వరకు సమ్‌ అష్యూర్డ్‌ను పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version