26\11 ఉగ్ర దాడి సమయంలో డీఐజీ ఎటిఎస్ గా ఉన్న పరమ్ బీర్ సింగ్ పై రిటైర్డ్ ముంబై పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షంషేర్ ఖాన్ పఠాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉగ్ర దాడి తర్వాత పోలీస్ కస్టడి లో ఉన్న టెర్రరిస్ట్ అజ్మల్ అమీర్ కసబ్ ఫోను ను పరమ్ బీర్ సింగ్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసు విచారణ సమయం లో ఆ ఫోన్ కనిపించకుండా పరమ్ బీర్ సింగ్ ప్రయత్నించాడని ఆరోపించారు.
ఇది జాతీయ భద్రత విషయం కాబట్టి తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినం గా శిక్షించాలని అన్నారు. ఈ విషయం పై తాను 2021 జూలై లో నే ముంబై పోలీస్ కమిషనర్ కు లేఖ రాశానని తెలిపారు. ఈ న్యూస్ ను ప్రచారం చేయాలను కోలేదని అందుకే సిక్రెట్ గా ఉండాలని లేఖ రాశానని అన్నారు. కానీ ఇప్పుడు పరమ్ బీర్ సింగ్ చేసిన అంశాలుల లీక్ అయినందున ఇప్పుడు బయట కు చెబుతున్నానని అన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత సామాజిక బాధ్యతగా ఇలా మాట్లాడుతున్నాని టైర్డ్ ముంబై పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షంషేర్ ఖాన్ పఠాన్ తెలిపారు.