ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశాయని, వారు ఒక రహదారిపై అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. వీరిలో ఇద్దరు తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డులు ఉన్నట్లు తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క 30వ బెటాలియన్ సంయుక్త బృందం సిఆర్పిఎఫ్ యొక్క చిల్పరస్ శిబిరం నుండి శోధన/ఏరియా డామినేషన్ ఆపరేషన్ ప్రారంభించింది.
అటవీ ప్రాంతంలోకి వెళ్లిన తరువాత వీరికి ముగ్గురు మావోయిస్టులు కనిపించారు. తమను చూసి తప్పించుకుని పోవటానికి ప్రయత్నించిన ఆ ముగ్గురిని డీఆర్జీ, సీఆర్పీఎఫ్బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి ఓ వాకీటాకీ, టార్చిలైట్, ఆరువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ శలభ్కుమార్సిన్హా వెల్లడించారు. పట్టుబడిన మావోయిస్టుల్లో ఉత్తర బస్తర్5వ డివిజన్కంపెనీలోని సెక్షన్ఏకు డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరిస్తున్న పీలూరాం అంచల ఎలియాస్సాలిక్ రాం (35), డివిజన్మెంబర్గా ఉన్న పనావు రాం మండవి (22), రమేశ్పూనెమ్ఎలియాస్బద్రూ (25) ఉన్నట్టు ఆయన చెప్పారు. వీరిలో పీలూరాం, పూనెమ్లపై ప్రభుత్వం ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రివార్డులు ప్రకటించిందని పేర్కొన్నారు.