మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన దక్షిణ మధ్య రైల్వే లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. దక్షిణ మధ్య రైల్వేలో 2022-23 సంవత్సరానికి సంబంధించి మొత్తం 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తో పాటు వివిధ రాష్ట్రాల్లో వుండే వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లో కనీసం 50 శాతం మార్కుల తో ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికి వస్తే.. డిసెంబర్ 30, 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రూ.100లు అప్లికేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు ఫీజు కట్టక్కర్లేదు.
ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ జనవరి 29, 2023 కనుక ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఎటువంటి రాత పరీక్షలేకుండా విద్యార్హతలను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలని http://34.93.184.238/register.php లో చూసి అప్లై చేసుకోవచ్చు.