మీ ఆడపిల్ల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నారా..? 22 ఏళ్లకు రూ.52 లక్షలు..ఈ స్కీమ్ తో..!

-

చాలామంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా లాభాల్ని పొందొచ్చు. అయితే కేంద్రం ఇస్తున్న స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఎన్నో లాభాలని పొందొచ్చు. పైగా ఏ రిస్క్ ఉండదు. మీకు ఏటా 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. కుమార్తె భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇందులో డబ్బులు పెట్టచ్చు.

ఈ పథకం కేవలం అడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయిలకి ఆర్థిక భద్రత కల్పించాలనే మోదీ సర్కార్ ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే దాదాపు 3 రెట్లు రాబడిని పొందే గ్యారంటీ కూడా ఉంటుంది. ఈ స్కీమ్ లో వచ్చిన డబ్బులని మీరు మీ కుమార్తె చదువు కోసమో ఉద్యోగం కోసమో ఉపయోగించచ్చు.

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో డబ్బులు పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-సి కింద ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రూ. 1.50 లక్షల వరకు వార్షిక పెట్టుబడికి మినహాయింపు ఉంటుంది. నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ. 1,20,000 వస్తాయి. 15 ఏళ్లలో రూ.18,00,000 పెట్టుబడి పెట్టినట్టు. మెచ్యూరిటీపై మొత్తం రూ. 52,74,457. రూ.34,74,457 వడ్డీ ప్రయోజనం ఉంటుంది. 185% రాబడి హామీ ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్ లో మీరు రూ. 250 మరియు రూ.1.50 లక్షలు దాకా పెట్టుబడి పెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version