పర్యావరణ హితమైన ‘చెట్టు వినాయకుల’ను తయారు చేసిన పిల్లలు..!

-

బెంగళూరుకు చెందిన డీఎస్ ఆర్ వుడ్ విండ్స్ అనే అపార్ట్ మెంట్ వాసులు కూడా అందరిలాగానే వినాయక చవితి వేడుకలు చేసుకోవాలనుకున్నారు. కానీ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడిని ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకులను వాడకండి. వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉండే సీసం వల్ల కొలను, చెరువులు, నదుల్లో ఉండే జీవరాశులు చనిపోతాయి. వాటిని తినడం వల్ల మనుషులకు కూడా క్యాన్సర్ వ్యాధి సంభవిస్తుంది. అందుకే… రంగుల రంగుల వినాయకులను వాడకండి. పర్యావరణ హితమైన మట్టి వినాయకులనే వాడండి… అంటూ పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నా… ఇప్పటికీ 80 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినవే.

బెంగళూరుకు చెందిన డీఎస్ ఆర్ వుడ్ విండ్స్ అనే అపార్ట్ మెంట్ వాసులు కూడా అందరిలాగానే వినాయక చవితి వేడుకలు చేసుకోవాలనుకున్నారు. కానీ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడిని ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు.

పర్యావరణహితంగా, ఎటువంటి రసాయనాలు కలువనటువంటి గణేశ్ విగ్రహాలను వాళ్లే తయారు చేసుకొని పూజించాలనుకున్నారు. దీంతో అపార్ట్ మెంట్ లోని 4 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు అదే అపార్ట్ మెంట్ కు చెందిన ఐటీ కన్సల్టెంట్ బిజాల్ షా అనే మహిళ చెట్టు వినాయకులను చేయడం నేర్పించారు. కేవలం రెండు రోజుల్లోనే 75 మంది పిల్లలంతా చెట్టు వినాయకుడిని చేయడం నేర్చుకున్నారు.

సాధారణంగా మట్టి వినాయకులను చూసి ఉంటారు కానీ.. ఈ చెట్టు వినాయకుడు కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది కదా. అంటే మట్టితో వినాయకుడిని తయారు చేసిన తర్వాత… ఆ వినాయకులకు పూజలు చేసి వాటిని తీసుకొని మట్టితో తయారు చేసిన ట్రేలో పెడతారు. ఆ ట్రేలో మెంతి కూర గింజలు చల్లుతారు. తర్వాత కొన్ని రోజుల వరకు నీరు పోస్తారు. కేవలం మూడు వారాల్లోనే ఆ ట్రే లో మెంతి కూర పెరిగి పెద్దదవుతుంది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు ఆ మెంతి కూరను కూర వండుకొని తింటారు.

గత సంవత్సరం ఈ అపార్ట్ మెంట్ వాసులు అదే పని చేశారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకపోగా… ఇంట్లోనే సహజసిద్ధంగా ఆకుకూరలు పండించుకునే అవకాశం ఉంది.

ఆ అపార్ట్ మెంట్ లోని 250 కుటుంబాలు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. వాళ్లు వినాయకుడికి పూజలు చేసే సమయంలో కూడా ఎటువంటి ప్లాస్టిక్ ను ఉపయోగించరు. అన్నీ పర్యావరణ హితమైనవే. సూపర్ కదా. బెంగళూరు లాంటి అంత పెద్ద నగరంలో ఒక అపార్ట్ మెంట్ వాసులు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టు వినాయకులను తయారు చేయడం అద్భుతం. ఈ అపార్ట్ మెంట్ వాసులను అందరూ ఫాలో అయితే సూపర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version