7th pay commission: ఉద్యోగుల కోసం ఎల్‌టీసీ కొత్త రూల్స్..

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో అప్డేట్ ను అందించింది.కేంద్ర ఆర్థిక శాఖ..ఎల్‌టీసీ రూల్స్ ను తాజాగా సవరించింది..వృధా ఖర్చులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నియమాలను మార్చిందని చెబుతున్నారు.విమానాలలో ట్రావెట్ క్లాసులో అతి తక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్‌ని ఎంచుకోవాలని, పర్యనటనలు, ఎల్టీ సీ కలిపిమూడు వారాల కన్నా ముందే టికెట్ బుక్ చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, వారి జీతంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ చాలా ముఖ్యమైన అంశం.

విమానం లేదా రైలు లేదా రోడ్డు ద్వారా ప్రయాణించే సౌకర్యాన్ని అందిస్తుంది.అంతేకాదు అందుకు సంభందించిన ప్రయాణపు ఖర్చులను కూడా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు కొంతమంది ఉద్యోగులకు ఆందోళన కలిగించే విషయం..

ఎల్‌టీసీ కొత్త రూల్స్..

ఒక ప్రయాణం చేసినప్పుడు ఒక టిక్కెట్ ను మాత్రమే కొనుగోలు చెయ్యాలి.టిక్కెట్లను ట్రావెలింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి..

ఎలా రూల్స్ వర్తిస్తాయి..

ఉద్యోగులు తమ టిక్కెట్లను రద్దు చేయకుండా ఉండవలసిందిగా కూడా పేర్కోనబడింది. రద్దు చేస్తే తెలియజేయండి: టిక్కెట్‌లను రద్దు చేయడానికి కారణాన్ని ఉద్యోగులు 72 గంటల్లోగా వివరణ సమర్పించాలి. అలాగే వారు ఏజెంట్లకు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. ప్రయాణానికి సంబంధించి 72 గంటలలోపు బుక్ చేసిన, 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో రద్దు చేసిన ఉద్యోగి స్వయంగా జస్టిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అనధికారిక ట్రావెల్ ఏజెంట్స్, వెబ్ సైట్స్ నుండి టికెట్ బుకింగ్ చేసే పరిస్థితులు ఏర్పడితే జాయింట్ సెక్రటరీ లేదా అంతకన్నా ఎక్కువ స్థాయి అధికారి మాత్రమే సడలింపులు మంజూరు చేయాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ఎప్పుడూ ఉండకపోవచ్చు. ప్రయివేట్ రంగంలోని వ్యవస్థ మాదిరిగానే ఉద్యోగి పనితీరును పరిగణనలోకి తీసుకొని జీతం పెంపు ఉంటుంది. ఇది కాకుండా, డీఏ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందుతుంది. డీఏ బకాయిల కోసం 18 నెలల నిరీక్షణ ముగిసింది. ఒకేసారి రూ.2 లక్షల వరకు డీఏ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version