Breaking: 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు శుభవార్త

-

ఏపీ ప్రభుత్వం 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు జీవో 27 జారీ చేపట్టారు. 4,537 మందికి కాంట్రాక్ట్ పద్ధతిన రూ.33 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయడాం జరిగింది. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు జీవో 27 జారీ చేసినట్లు తెలిపారు ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం. 1998 డీఎస్సీ అభ్యర్థుల సుదీర్ఘపోరాటం అనంతరం జీవో 27 అభ్యర్థుల్లో ఊపిరినింపింది. అయితే గత జూన్‌లోనే 98 డీఎస్సీ అభ్యర్థులకు టైం స్కేల్‌ ప్రకారం సెకండరీ గ్రేడ్‌ పోస్టుల్లో భర్తీ చేసేందుకు ఫైల్‌ఫై సంతకం చేశారు సీఎం జగన్. దీంతో అక్కడక్కడ చెల్లాచెదురైపోయిన అభ్యర్థులు ఊపిరిపోసుకుని 24 ఏళ్ల తరువాతైన తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న కొండంత ఆశతో గత జూలైలో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నరు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో విద్యాశాఖ కమిషనర్‌ నుంచి చకచకా కిందిస్థాయి అధికారులకు 98 డీఎస్సీ అభ్యర్థుల వివరాలు అందజేయాలని ఆదేశాలు రావడంతో ఆగ మేఘాలు మీద వివరాలు ఇచ్చారు.

అప్పటికే 60 ఏళ్ల వయసుకు దగ్గరగా ఉన్న అభ్యర్థులు కనీసం కొద్ది నెలల పాటైనా ప్రభుత్వ ఉద్యోగం చేశామన్న తృప్తి ఉంటుంది అన్నారు. గడిచిన 8 నెలలుగా అధికారులు హడావుడి, నాయకుల ప్రకటనలు, అభ్య ర్థులు దరఖాస్తులు, ఆన్‌లైన్‌లో అంగీకార పత్రాలు, 24 ఏళ్ళ తరువాత సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ కొనసాగాయి. కానీ ఆ తరువాత ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతిసారి విద్యాశాఖ సమీక్షలో 98 డీఎస్సీ వారికి త్వరలో ఉద్యోగాలు ఇస్తామని, టైం స్కేల్‌ ఇస్తామని ఫైల్‌పై సీఎం సంతకం చేశారని, కేబినేట్‌లో మాట్లాడారని, మంత్రిమండలిలో ఆమోదం తెలిపారని, ముఖ్యమంత్రి విధాన పరమైన నిర్ణయం తీసుకున్న తరువాత కూడా అదిగోఇదిగో అంటూ 9 నెలలు అయిపోయాయి. వయసు మీరిపోతున్న చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ఆశలు వదిలేసుకుంటున్నారు. జనవరి 2023 రావడంతో అభ్యర్థుల్లో చాలా మందికి 60 సంవత్సరాలు కూడా నిండిపోయాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version