వామ్మో: భిక్షాటన చేసి రూ.55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు

-

భిక్షాటన చేసి ఓ బిచ్చగాడు పది మందిని ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55 లక్షలు ప్రభుత్వానికి దానం చేశాడు. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్(72) బిచ్చగాడు. ఇతను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను పది మందికి సాయం చేయాలని అనుకున్నాడు. భిక్షాటన చేసి సంపాదించిన డబ్బులను సీఎం సహాయనిధికి అందజేశాడు.

పూల్ పాండియన్

ఇప్పటివరకు పూల్ పాండియన్ రూ.55.60 లక్షలను పలు సందర్భాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేశాడు. సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో గ్రీవెన్‌సెల్‌కు వెళ్లి తన దగ్గరున్న రూ.10 వేలు అందజేశాడు. ఈ డబ్బులను శ్రీలంకలోని తమిళులకు ఉపయోగించాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం కారణంగా తమిళులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు సాయం అందించాలని పూల్ పాండియన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version