రాజస్థాన్ లోని రామా చంద్రం అనే గ్రామంలో నివాసం ఉంటున్నాడు నరసింహులు. 16 సంవత్సరాల కిందట నరసింహులు భార్య సోదరి సునీత, చదువుకోవడానికి అక్క వద్దకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన సునీతతో నరసింహులు కొన్ని కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరు పట్టించుకోలేదు. ఆమె సోదరి కూడా అడ్డు చెప్పలేదు.
దీంతో సునీత నరసింహులు తమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మేస్త్రి పని చేసే నరసింహులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మత్తులో బజ్జీలు తేవాలంటు సూచించాడు. ఎవరు వెళ్లకపోవడంతో అతనే వెళ్లి తెచ్చుకున్నాడు. ఇంటి కిరాయి కట్టడానికి డబ్బులు లేవు.. కానీ మద్యం తాగి బజ్జీలు తెచ్చుకుంటావా అని సునీత గొడవ పడింది.
ఈ సమయంలో నరసింహులు భార్య అలాగే కుమారుడు ఇంట్లో మంచి బయటికి వెళ్లారు. గొడవతో మనస్థాపన చెందిన సునీత ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకుంది. దీని గమనించిన నరసింహులు… స్థానికుల సహాయంతో సునీతను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…దర్యాప్తు జరుపుతున్నారు.