కొడుకు కోసం 2700 కిలోమీటర్లు కారులో వెళ్ళిన తల్లి…!

-

కరోనా కారణంగా కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు  అమలు చేస్తున్నా సరే రాజస్థాన్ లోని జోద్ పూర్ లో తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న తన కుమారుడిని కలవడానికి 50 ఏళ్ల మహిళ సుధీర్గ ప్రయాణం చేసింది. ఆరు రాష్ట్రాలలో కారులో 2,700 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆ మహిళ తన అల్లుడు మరియు మరొక బంధువుతో కలిసి ఉంది, వారు 3 రోజుల వ్యవధిలో అక్కడికి చేరుకున్నారు.

కేరళకు చెందిన షీలామా వాసన్ అనే మహిళ తన కొడుకు కోసం వెళ్ళారు. మైయోసిటిస్ (కండరాల వాపు) తో బాధపడుతున్న తన కుమారుడు అరుణ్ కుమార్ (29) ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె అక్కడి వరకు వెళ్ళింది. ప్రస్తుతం కుమారుడి ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పుకొచ్చారు. “దేవుని దయ కారణంగా మేము ఎక్కడా సమస్యలు లేకుండా ఇక్కడకు చేరుకున్నాము” అని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు.

అరుణ్ కుమార్ పరిస్థితి గురించి జోధ్ పూర్ లోని ఎయిమ్స్ వైద్యుడి నుంచి కుటుంబానికి సమాచారం అందింది, ఆ తరువాత వారు కేరళ నుండి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా రాజస్థాన్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రి వి మురళీధరన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం మరియు కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ తనకు ఈ సహాయం చేసారని… ప్రయాణానికి పాస్ లు అందించారని ఆమె పేర్కొన్నారు. విశ్వ హిందు పరిషత్ సంస్థ ఒక కారుని, ఒక టాక్సీ డ్రైవర్ ని ఉచితంగా ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news