రాష్ట్రంలోని అన్నదాతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చికి మద్దతు ధర నిర్ణయించాలని వారు ఆందోళనకు దిగారు. క్వింటాల్‌కు రూ.20 వేల కనీస మద్ధతు ధర నిర్ణయించి మిర్చి పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని వైరా పట్టణం లాలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా మిర్చికి రూ.20 వేల కనీస ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్దకు మిర్చి పంటను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులు ఈ మేరకు నిరసన చేపట్టారు.