40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకొన్న పుల్వామా ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఏడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు.ఈ ఘటనకు కారకులైన 20 ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, రవూఫ్ అజ్గర్ వంటి వారిని చేర్చినట్టు తెలుస్తోంది.
జమ్మూలోని ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. 18 నెలల సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఎన్ఐఏ 5 వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ వేయనుంది. 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్ర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.పాకిస్థాన్ నుంచి దాదాపు 20 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు సామాగ్రిని పేలుడు కోసం తెచ్చినట్టు ఓ అధికారి తెలిపారు.