ఢిల్లీ లోని అశోక రోడ్డులో ఉన్న హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం దుండగులు ఓవైసీ ఇంటి ప్రహరీ గోడ మరియు గేటును ద్వంసం చేశారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్న అనంతరం డిజిపి దీపక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
అసదుద్దీన్ ఇంటిపై దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్ట్ అయిన వారు హిందూ సేన సభ్యులుగా డీజీపి తెలిపారు. ఎంపీ అసదుద్దీన్ కొద్దిరోజుల క్రితం ఓ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లోనే అతడి ఇంటిపై దాడి చేశామని ఆందోళన కారులు చెబుతున్నారు. ఈ విషయం పై హిందూసేన అధినేత విష్ణు గుప్తా స్పందించారు. ఓవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తోనే తమ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెప్పారు.