ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై టన్నెల్ కాంట్రాక్టర్ జేపీ గ్రూప్ అధినేత జై ప్రకాశ్ గౌర్ ఎట్టకేలకు స్పందించారు. అయితే, ఆయన స్పందించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు వ్యక్తికి ప్రాణాలు అంటే విలువలేదని, కేవలం డబ్బు, వర్క్ గురించే ఆలోచిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకూ ఆయన ఏం మాట్లాడారంటే.. ‘ప్రమాదాలు మామూలే, మృతదేహాలు తొలగించి పనులు చేపట్టాలి.
నా జీవితంలో టెహ్రీ, భూటాన్, జమ్ము-కాశ్మీర్ వంటి 6-7 సంఘటనలను చూశాను.మృతదేహాలను తొలగించి ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయాలో మంత్రితో చర్చించాము.TBM మెషిన్ కట్ చేస్తే భారీ ఖర్చు, తిరిగి పనులు ప్రారంభించడానికి ఆలస్యం అవుతుంది’ అని వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.
ఎంత నిర్లక్ష్యం..!!!
ప్రమాదాలు మామూలే.. మృతదేహాలు తొలగించి పనులు చేపట్టాలి
నా జీవితంలో టెహ్రీ, భూటాన్, జమ్ము-కాశ్మీర్ వంటి 6-7 సంఘటనలను చూశాను
మృతదేహాలను తొలగించి ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయాలో మంత్రితో చర్చించాము
TBM మెషిన్ కట్ చేస్తే భారీ ఖర్చు, తిరిగి పనులు… pic.twitter.com/6vtWmthtBu
— PulseNewsBreaking (@pulsenewsbreak) February 27, 2025