బాబు టీమ్ పై అచ్చెన్న అసంతృప్తి ?  

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఏరి కోరి మరీ అచ్చెన్న నాయుడు ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు చేశారు. అచ్చెన్న ద్వారా ఏపీ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తూ,  ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు బాబు అన్ని రకాల ఎత్తుగడలను రూపొందించుకున్నారు. అచ్చెన్న సైతం కొత్తగా వచ్చిన బాధ్యతలతో, ఏపీ ప్రభుత్వం పై విరుచుకు పడతారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం పార్టీ కి పునర్వైభవం తీసుకు వస్తారని , దీనికి తగ్గట్టుగానే మొదట్లో అచ్చెన్న  కాస్త హడావుడి చేసినా, ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. దీనికి కారణం పార్టీలో కీలక పదవి ఇచ్చినా, దానికి సంబంధించిన అధికారాలు మొత్తం చంద్రబాబు వద్దే ఉంచుకోవడంతో అచ్చెన్న తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.
చంద్రబాబు రాష్ట్ర కమిటీ ని ప్రకటించారు. ఆ కమిటీల నియామకం సందర్భంగా, బాబు అచ్చెన్న ను సంప్రదించకుండానే కమిటీల నియామకాలను పూర్తి చేయడం తో గుర్రుగా ఉన్నారట.ముందుగా సంప్రదిస్తారు అని భావించినా, బాబు మాత్రం పూర్తిగా తనకు నచ్చిన వారికి కమిటీల్లో స్థానం కల్పించడం తో ఇప్పుడు అచ్చెన్న వర్గం గుర్రుమంటోంది. కనీసం  తమను ఏ మాత్రం సంప్రదించకుండానే ఇలా చేయడం ఏంటి అంటూ అచ్చెన్న తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారట. ఇందులో బాబు ని తప్ప పట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినా, కనీసం అచ్చెన్న కు పట్టు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో నియమించిన కమిటీల్లో అయినా, అచ్చెన్న తనకు నచ్చిన వారికి పదవులు ఇచ్చేందుకే అవకాశం లేకుండా చేశారు అంటూ అచ్చెన్న కాస్త అసంతృప్తికి గురయ్యారట.
 అందుకే పార్టీ అంత కీలక బాధ్యతలు అప్ప జెప్పినా యాక్టివ్ గా ఆయన ఉండలేకపోతున్నారట.పోనీ ఈ కమిటీల్లో మార్పు చేర్పులు చేద్దాం అంటే అది చంద్రబాబు చేపట్టిన నియామకాలు కావడంతో సైలెంట్ గానే అచ్చెన్న ఉండిపోతున్నరట. అచ్చెన్న అసంతృప్తి తో ఉన్నారు అనే విషయం బాబు చెవిన పడిందో లేదో , పడినా సైలెంట్ గా ఉన్నారో అనుకుంటూ టిడిపి లో ఇప్పుడు గుసగుసలు మొదలయ్యాయి.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version