కరోనా ఎఫెక్ట్ :కూరగాయలు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు.!

-

కరోనా దెబ్బకు దేశంలో ఊహించని సంక్షోభం వచ్చిపడింది. ఈ వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడటంతో అటు ప్రజలు, ఇటు ప్రముఖులు ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయారు. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే కార్మికుల‌కు, చిన్న‌, చిన్న న‌టుల క‌ష్టాలు వర్ణించడానికి వీలు లేనివి. వారికి లాక్‌ డౌన్ క‌ష్టాలు క‌డుపు కాలేలా చేస్తున్నాయి. తాజాగా ఓ నటుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.

బాలీవుడ్ నటుడు జావేద్ హైద‌ర్ కూరగాయలు అమ్ముతున్న వీడియోను బిగ్‌ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌ టాక్‌ లో షేర్ చేసింది. క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌ డౌన్ వ‌ల్ల అత‌డికి ఉపాధి క‌రువైంది. దీంతో విధి లేక పొట్ట‌కూటి కోసం కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడంటూ ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రైవేట్ టీచర్ ఉపాధి లేక అరటిపళ్లు అమ్మిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version