అభిమానులకు శుభవార్త చెప్పబోతున్న ఆది పినిశెట్టి- నిక్కి..

-

ఆది పినిశెట్టి, నిక్కి గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది మే లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట త్వరలోనే ఓ శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తోంది..

adhi pinisetti

యంగ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి తనయుడే ఆది పినిశెట్టి. వాస్తవానికి తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆది.. అయితే ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్న ఆది హీరోయిన్ నిక్కి.. ఈ ఏడాది మీలో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.. అయితే వీరికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిక్కీ గల్రాని గర్భం దాల్చారన్న వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకు వీరు ఎలాంటి అధికార సమాచారం ఇవ్వక పోయినప్పటికీ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది.. అయితే అసలు విషయం ఏంటనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.. మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. అయితే నీకే మొదటగా ఆదికి ప్రేమ ప్రపోజల్ తీసుకొచ్చిందంట.. కొన్ని రోజుల విషయాన్ని అసలు పట్టించుకోని అది తర్వాత ఆమె సిన్సియారిటికి పడిపోయాడంట.. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వీరిద్దరి వివాహం ఈ ఏడాది మే లో ఘనంగా జరిగింది..

దర్శకుడు రవి రాజ పినిశెట్టి కుమారుడైన ఆది ఒక వి చిత్రం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో రంగస్థలం, సరైనోడు, అజ్ఞాతవాసి, నిన్నుకోరి చిత్రాల్లో నటించారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో ఆదికి మంచి బ్రేక్ వచ్చింది.. అయితే తెలుగులో కన్నా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆదికి హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన వైశాలి చిత్రం మంచి విజయాన్ని అందించింది. హీరోగా నటిస్తూనే విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తూ వస్తున్నారు ఆది.. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీగా గడుపుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version