హైకోర్టులో ఆత్మీయ వీడుకోలు…

-

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విడిపోయిన సందర్భంగా తెలంగాణలోని ఏపీ న్యాయమూర్తులు స్వరాష్ట్రానికి తిరిగి పయనమవుతున్న సందర్భంగా హైకోర్టులో హడావిడి  వాతావరణం కనిపించింది.  తెలంగాణ లాయర్లు, న్యాయ సిబ్బంది శుభాకాంక్షలతో ఆత్మీయ వీడికోలు తెలిపారు. జనవరి 1వ తేది నుంచి రెండు హైకోర్టులుగా విడిపోవడంతో ఒకవైపు హడావిడి మరోవైపు సహచర సిబ్బంది వెళ్లిపోతుండటంతో ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తోటి న్యాయవాదులతో సెల్ఫీలు తీసుకున్నారు. ఏపీకి సిబ్బందిని, లాయర్లను తరలించేందుకు అమరావతి నుంచి ప్రత్యేక బస్సులను పంపించారు.

 రేపు ఉదయం అమరావతిలో ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్‌చే ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనను నిలిపివేయాలంటూ ఏపీ న్యాయవాదులు దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నో చెప్పడంతో ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియరైంది. ఇక జనవరి 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులు పనిచేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version