Agent : ప్రేక్షకులకు ఏజెంట్ నిర్మాత క్షమాపణలు

-

వరుస ఫ్లాప్​లతో సతమవుతున్న అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీతో అయినా గాడిన పడతాడనుకుంటే ఈ చిత్రం కూడా నిరాశ పరిచింది. అఖిల్‌తో నిర్మించిన ఏజెంట్ సినిమా పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని ఆ చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర తెలిపారు. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం కాకముందే చిత్రాన్ని ప్రారంభించి తప్పుచేశామని చెప్పారు. ఏప్రిల్ 28న విడుదలైన ఏజెంట్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రతికూల ఫలితాన్ని అందుకోవడంతో అక్కినేని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

ఆ విషయంపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నిర్మాత అనిల్ సుంకర.. ఏజెంట్ ఫలితం విషయంలో తాము ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదని అన్నారు. అందుకు పూర్తి బాధ్యత తమదేనని చెప్పారు. ఆ కాస్ట్‌లీ తప్పిదం నుంచి ఎన్నోవిషయాలు నేర్చుకున్నామని తెలిపారు. భవిష్యత్‌లో అలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలో ఆలోచిస్తామన్న ఆయన..ఏజెంట్ చిత్రంపై ఎంతో నమ్మకంపై పెట్టుకున్న ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. తదుపరి ప్రాజెక్టులతో ఆ లోటను భర్తీ చేస్తామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news