కాలుష్యంపై హర్యనా సర్కార్ కీలక నిర్ణయం… పలు జిల్లాల్లో స్కూళ్ల మూసివేత.

-

ఢిల్లీ కాలుష్యం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రజలు గొంతు నొప్పి, ఎలర్జీలతో బాధపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. స్కూళ్లను వారం పాటు మూసేయడంతో పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. తాజాగా హర్యానా సర్కారు కూడా వాయు కాలుష్యంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

తాజాగా మూడు పట్టణాల్లో స్కూళ్లను మూసేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్‌లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్త ను కాల్చడాన్ని కూడా నిషేధించింది. కాలుష్యంపై ఇటీవల సుప్రీం కోర్ట్ కేంద్రానికి, హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలను హెచ్చిరించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ ను పరిశీలించాలని కోరింది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ కూడా కాలుష్యంపై చర్యలు తీసుకుంటుంది. కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలపై జరిమానాతో కొరడా ఝుళిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version